సంతోషమే సమాధానమే చెప్పనశక్యమైన సంతోషం

సంతోషమే సమాధానమే (3)
చెప్ప నశక్యమైన సంతోషం (2)

1. నా హృదయము వింతగ మారెను (3)
నాలో యేసు వచ్చినందునా (2)              “సంతోషమే”

2. తెరువబడెను నా మనోనేత్రము (3)
క్రీస్తు నన్ను ముట్టినందునా (2)              “సంతోషమే”

3. ఈ సంతోషము నీకు కావలెనా (3)
నేడే యేసు నొద్దకు రమ్ము (2)              “సంతోషమే”

4. సత్య సమాధానం నీకు కావలెనా (3)
సత్యుడేసునొద్దకు రమ్ము (2)              “సంతోషమే”

5. నిత్యజీవము నీకు కావలెనా (3)
నిత్యుడేసునొద్దకు రమ్ము (2)              “సంతోషమే”

6. మొక్ష్యభాగ్యము నీకు కావలెనా (3)
మోక్ష రాజునొద్దకు రమ్ము (2)              “సంతోషమే”

7. యేసు క్రీస్తును నేడే చేర్చుకో (3)
ప్రవేశించు నీ హృదయమందు (2)              “సంతోషమే”

(Santhoshame Samaadhaaname Cheppanasakyamaina Santhosham)