న్యాయాధిపతియైన దేవుడు నిన్ను పిలిచే వేళలోన

న్యాయాధిపతియైన దేవుడు – నిన్ను పిలిచే వేళలోన
ఏ గుంపులో ఉంటావో తెలుసుకో – మరలా వచ్చే వేళలోన (2)
ఒక గుంపేమో పరలోకపు గుంపు
రక్షింపబడిన వారికే అది సొంతం
మరు గుంపేమో ఘోర నరకపు గుంపు
నిజ దేవుని ఎరుగని వారికి అది అంతం      

1. నీవు కాదు నీ క్రియలు కాదు – ఆ పరముకు నిను చేర్చేది
కాదు కాదు వేరెవరో కాదు – మరణమును తప్పించేది (2)
కలువరిలో తన ప్రాణం పెట్టిన
యేసయ్యే నీ ప్రాణ రక్షణ
సిలువలో క్రయ ధనమే చెల్లించిన
ఆ ప్రభువే నీ పాప విమోచన         “ఒక గుంపేమో”

2. ఇదియే సమయం ఇక లేదే తరుణం – నీ పాపము ఒప్పుకొనుటకు
ఆ పరలోకం చేరే మార్గం – యేసేగా ప్రతి ఒక్కరకు (2)
మేఘముపై రానైయున్నాడుగా
త్వరలోనే నిను కొనిపోడానికి
వెనుదీయకు ఓ నా ప్రియ నేస్తమా
నీ హృదిలో స్వీకరించడానికి         “ఒక గుంపేమో”

(Nyaayaadhipathiyaina Devudu Ninnu Piliche Velalona)