నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును

నీవు చేసిన ఉపకారములకు – నేనేమి చెల్లింతును (2)
ఏడాది దూడలనా… వేలాది పోట్టేళ్ళనా (2) 

1. వేలాది నదులంత విస్తార తైలము – నీకిచ్చినా చాలునా(2)
గర్భఫలమైన నా జేష్ట్యపుత్రుని –  నీకిచ్చినా చాలునా(2)                      “ఏడాది”

2. మరణపాత్రుడనైయున్న నాకై – మరణించితివ సిలువలో (2)
కరుణచూపి నీ జీవమార్గాన – నడిపించుమో యేసయ్యా(2)                  “ఏడాది”

3. విరిగి నలిగిన బలియాగముగను –   నా హృదయమర్పింతును(2)
రక్షణ పాత్రను చేబూని నిత్యము –  నిను వెంబడించెదను(2)             “ఏడాది”

4. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు –  నీకేమి చెల్లింతును (2)
కపట నటనలు లేనట్టి హృదయాన్ని – అర్పించినా చాలునా(2)          “ఏడాది”

(Neevu Chesina Upakaaramulaku Nenemi Chellinthunu)