ఆశగల ప్రాణమును తృప్తిపరచు దేవా
ఆవేదన తొలగించి ఆదరించు దేవా
ఆశ్చర్యకరుడా ఆలోచనా కర్త
నీ మేలులకే ఈ ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన
1. గడిచిన కాలమంతా నీ కృపలో కాచి –
మరువని మేలులు ఎన్నో చేశావు (2)
నీ పాత్రగా నను మలచినావు – 2
శాశ్వత జీవమిచ్చి నూతన పరిచావు – 2 “ఆశ్చర్యకరుడా”
2. జీవిత కాలమంతా నీ శక్తితో నింపి –
విజయ పదమున నను నడిపించుము (2)
నీ సాక్షిగా నను నిలబెట్టుము – 2
శాశ్వత జీవమిచ్చి నూతనపరచుము – 2 “ఆశ్చర్యకరుడా”
(Aasagala Praanamunu Trupti Parachu Deva / Aashagala Pranamunu)