హల్లెలూయ యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి

హల్లెలూయ యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి 
వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి

1. బలమైన పని చేయు బలవంతుని స్తుతియిoచుడి
ఎల్లరిని స్వీకరించు – యేసును స్తుతియించుడి

          రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలున్
       హల్లెలూయ – హల్లెలూయ – దేవుని స్తుతియించుడి

2. తంబురతోను వీణతోను – ప్రభువును స్తుతియించుడి
పాపమును రక్తములో – తుడిచెను స్తుతియించుడి

3. బూరతోను తాళములన్ – మ్రోగించి స్తుతియించుడి
నిరంతరము మారని – యేసుని స్తుతియించుడి

4. సుర్య చంద్రులారా ఇల – దేవుని స్తుతియించుడి
హృదయమును వెలిగించిన – యేసుని స్తుతియించుడి

5. అగ్నివండగడ్లార మీరు – కర్తను స్తుతియించుడి
    హృదయమును చేదించిన – నాధుని స్తుతియించుడి

6. యువకులారా పిల్లలారా – దేవుని స్తుతియించుడి
జీవితమున్ ప్రభుపనికై – సమర్పించి స్తుతియించుడి

7. పెద్దలారా ప్రభువులారా – యెహోవాను స్తుతియించుడి
ఆస్తులను యేసునికై – అర్పించి స్తుతియించుడి 

(Halleluya Yesu Prabhun Yellaru Sthuthiyinchudi Vallabhuni Charyalanu)