దీనుల యెడల కృప చూపువాడా నీ దాసుని దాటిపోకయ్యో

దీనుల యెడల కృప చూపువాడా
నీ దాసుని దాటిపోకయ్యా -2
నీవే నా ఆధారము – నీవే నా ఆశ్రయము
నీవే నా ఆధారము నా యేసయ్య
నీవే నా ఆశ్రయము……

1. విరిగి నలిగి నేను ఉన్నానయ్యా
ఎదకోతతో నిన్నే చేరితినయ్యా -2
అమ్మలాగ ఆదరించే దేవుడవూ
అనాధగా నన్ను విడువని దేవుడవు -2 “నీవే నా ఆధారము”

2. విరోధుల అంబులకు అప్పగించకా
నా కవచం నీవై నన్ను కాపాడితివి -2
నా శ్రమ నిందలను చూచితివి
దుఃఖము సంతోషముగా మార్చితివి -2 “నీవే నా ఆధారము”

3. నా చేయి పట్టి నన్ను నడిపించితివి
కృపా ఐశ్వర్యములతో నన్ను నింపితివి-2
క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు
కృతజ్ఞుడనై నేను జీవించెదను-2 “నీవే నా ఆధారము”

(Deenula Yedala Krupa Chupuvaadaa Nee Daasuni Daatipokayyaa)