పదివేలలో అతిప్రియుడు సమీపించరాని తేజోనివాసుడు

పదివేలలో అతిప్రియుడు – సమీపించరాని తేజోనివాసుడు
ఆ మోము వర్ణించలేము – స్తుతుల సింహాసనాసీనుడు
నా ప్రభు యేసు(4)

1. ఏ బేధము లేదు ఆ చూపులో – ఏ కపటము లేదు ఆ ప్రేమలో (2)
జీవితమును వెలిగించే ఆ స్వరం – కన్నీరు తుడిచే ఆ హస్తము (2)
అంధకారంలో తానే దీపం – కష్టాలలో ప్రియ నేస్తం (2)
నా ప్రభు యేసు(2)                                                          “పదివేలలో”

2. దొంగలతో కలిపి సిలువేసినా – మోమున ఉమ్మివేసినా(2)
తాను స్వస్థత పరచిన ఆ చేతులే – తన తనవును కొరడాలతో దున్నినా(2)
ఆ చూపులో ఎంతో ప్రేమ – ప్రేమామూర్తి అతనెవరో తెలుసా(2)
నా ప్రభుయేసు(2)                                                             “పదివేలలో”

(Padivelalo Athi Priyudu Sameepincharaani Tejo Nivaasudu)