ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం
ప్రభు ప్రేమలో నిస్వార్ధమే వాత్సల్యమే నిరంతరం (2)
హాల్లేలూయా హాల్లేలూయా
హాల్లేలూయా ఆమేన్ హాల్లేలూయా (2)
1. ఆకాశము కంటె ఎత్తైనది
మన ప్రభు యేసుని కృపా సన్నిధి (2)
ఆ సన్నిధే మనకు జీవమిచ్చును
గమ్యమునకు చేర్చి జయమిచ్చును (2) “ప్రభు”
2. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు
ధరియింప చేయును ప్రభు సన్నిధి (2)
నూతనమైన ఆశీర్వాదముతో
అభిషేకించును ప్రేమానిధి (2) “ప్రభు”
(Prabhu Sannidhilo Aanandame Ullaasame Anudhinam)