సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై

సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై

సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం
మన హృదయము ప్రభుకొరకై
సిద్ధమనసను జోడు తొడిగి –  సమాధాన సువార్త చాటేదం (2)
సమాధాన సువార్త చాటిదం

1. ప్రతి ఉదయమున ప్రార్ధనతో నీ సన్నిధికి సిద్ధమౌదును జీవముకలిగిన వాక్కులకై – నీ సన్నిధిలో వేచియుందుము (2)
సిద్ధమనసను జోడు తొడిగి సమాధాన – సువార్త చాటేదం (2)
సమాధాన సువార్త చాటేదం

2. సత్‌కార్యముకై సిద్ధపడి పరిశుద్ధతతో ఉందుము
అన్నివేళలయందు ప్రభుయేసుని ఘనపరచి కీర్తింతుము
సిద్ధమనసను జోడు తొడిగి సమాధాన – సువార్త చాటేదం (2)
సమాధాన సువార్త చాటేదం

3. బుధ్ధిని కలిగి నీ రాకడకై మెలకువతో నేనుందుము

నీ రాజ్య సువార్తను ప్రకటించి – ప్రతివారిని సిద్ధపరచును
సిద్ధమనసను జోడు తొడిగి సమాధాన – సువార్త చాటేదం (2)
సమాధాన సువార్త చాటేదం

(Siddhapadudhaam Siddhapadudhaam Mana Devuni Sannidhikai)