దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం

దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం
ఒక ఘడియా యిచట గడుపుట మేలు

వేయి దినముల కంటేను

1. అద్బుత కార్యములు ఆ… జరిగించు దేవుడవు ఆ….
అనవరతము నీ మహిమలు పొగడ

ఆత్మలో నిలుపుమయా
అత్మతో సత్యముతో ఆరాధించగ మనసుతో
అల్ఫా ఒమెగయు ఆత్మ రూపుడవు
ఆనందించగ నీ మదిలో                                              “దేవా”

2. పరిశుద్ధ సన్నిధిలో ఆ… పరిశుద్ధాత్ముని నీడలో ఆ….
పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో

ప్రభునే ప్రస్తుతియించెదం
మా దేహమే ఆలయం కావాలి నీకే నిలయం
ప్రాణ ప్రియుడవు పదముల చేరి ప్రాణార్పణము జేతుము     “దేవా”

(Deva Nee Aavaranam Maakentho Sreyaskaram)