గగనము చీల్చుకొని యేసు ఘనులను తీసికొని

గగనము చీల్చుకొని యేసు ఘనులను తీసికొని
వేలాది దూతలతో భువికి వేగమె రానుండె

1. పరలోక పెద్దలతో పరివారముతో కదలి (2)
ధరసంఘ వధువునకై (2) తరలెను వరుడదిగో (2) “గగనము”

2. మొదటగను గొఱ్ఱెగను ముదమారగ వచ్చెను (2)
కొదమసిం-హపురీతి (2) కదలెను గర్జనతో (2) “గగనము”

3. కనిపెట్టు భక్తాళీ కనురెప్పలో మారెదరు (2)
ప్రథమమున లేచెదరు (2) పరిశుద్ధులు మృతులు (2) “గగనము”

(Gaganamu Cheelchukoni Yesu Ghanulanu Theesikoni)