బూర ధ్వనితో యేసు రానైయున్నాడు
భూదిగంత వాసులకు తానే దేవుడు (2)
హల్లెలూయ,హల్లెలూయ, హల్లెలూయ (3)
1. సుద్ధ సువర్ణం కన్నా ఎంతో శ్రేష్టుడు
సర్వ సంపదల కన్న కోరదగిన వాడు (2) “హల్లెలూయ”
2 . ధవళ వర్ణుడు యేసు నా రక్షకుడు
ధరలో జీవపు వెలుగై నన్ను వెలిగించిన వాడు (2) “హల్లెలూయ”
3. రత్నవర్ణుడు యేసు నా రక్షకుడు
రక్త క్రయధనమిచి నన్ను రక్షించిన వాడు (2) “హల్లెలూయ”
4. సర్వాంగ సుందరుడు సకల చరాచరుడు
సర్వoబు సిలువలో నాకై అర్పించిన వాడు (2) “హల్లెలూయ”
(Bhoora Dhvanitho Yesu Raanaiyunnaadu)