ఓ తల్లి కన్ననూ ఓ తండ్రి కన్ననూ
ప్రేమించు దేవుడు క్షమియించు దేవుడు
ప్రేయసికన్నా ప్రేమించు దేవుడు
ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు
1. కాలాలు మారిన కరిగిపోని ప్రేమ – కల్వరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ
ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకునే ప్రేమ
తల్లియైన మరచినా నిను మరువని ప్రేమ
ప్రేమా ప్రేమా ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమ
ప్రేమా ప్రేమా ఏ బదులాశించనిది యేసు ప్రేమ
2. పర్వతాలు తొలగినా తొలగిపోని ప్రేమ
పాపులనీ త్రోయక దరిచేర్చు ప్రేమ
ప్రాణ స్నేహితుడై ప్రాణ మిచ్చిన ప్రేమ
పరలోకమునకు నిన్ను జేర్చు ప్రేమ
ప్రేమా ప్రేమా ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమ
ప్రేమా ప్రేమా ఏ బదులాశించనిది యేసు ప్రేమ
(O Thallikannanu O Thandrikannanu Preminchu Devudu)