సృష్టికర్తవైన యెహోవా
నీ చేతిపనియైన నాపై ఎందుకింత ప్రేమ
మంటికి రూపమిచ్చినావు
మహిమలో స్థానమిచ్చినావు
నాలో నిన్ను చూసావు
నీలో నన్ను దాచావు
నిస్స్వార్ధ్యమైన నీ ప్రేమా
మరణము కంటె బలమైనది నీ ప్రేమ
- ఏ కాంతి లేని నిశీధిలో
ఏ తోడు లేని విషాదపు వీధులలో
ఎన్నో అపాయపు అంచులలో
నన్నాదుకున్న నా కన్న తండ్రివి (2)
యేసయ్యా నను అనాథగా విడువక
నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి (2)
2. నిస్సారమైన నా జీవితములో
నిట్టూర్పులు నన్ను దినమెల్ల వేదించగా
నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి
నన్నాకర్షించిన ప్రేమమూర్తివి (2)
యేసయ్యా నను కృపతో బలపరచి
ఉల్లాస వస్త్రమును నాకు ధరింపజేసితివి (2)
(Srushtikarthavaina Yehova Nee Chethipaniyaina Naapai)