సింహ పిల్లలు పస్తుపడినన్ దేవుని వెదకిన కొదువ లేదు

సింహ పిల్లలు పస్తు పడినన్ – దేవుని వెదకిన కొదువ లేదు – 2

కొదువ లేదు కొదువ లేదు – దేవుని వెదకిన కొదువ లేదు

1. పచ్చిక వున్న స్థలములందు నన్ను మేపు ప్రభూ – 2

     నీటి యుద్ధ నడిపించుచూ దాహము తీర్చు ప్రభూ – 2

2. శత్రువుల యెదుట విందు సిద్ధము చేయు ప్రభూ – 2

     నా తలపై నూనె పోసి అభిషేకం చేయు ప్రభూ – 2

3.  ప్రాణముకు సేదతీర్చి ఆత్మతో నింపు ప్రభూ – 2

     నే బ్రతుకు దినములెల్ల కృప నన్ను వెంబడించున్ – 2

(Simha Pillalu Pasthupadinan Devuni Vedakina Koduva Ledu)