సీయోను పాటలు సంతోషముగా – పాడుచు సీయోను వెళ్ళుదము
లోకాన శాశ్వతానందమేమియు – లేదని చెప్పెను ప్రియుడేసు
పొందవలె నీ లోకమునందు – కొంతకాలమెన్నో శ్రమలు
1. ఐగుప్తును విడచినట్టి మీరు – అరణ్యవాసులే ఈ ధరలో
నిత్యనివాసము లేదిలలోన – నేత్రాలు కానానుపై నిల్పుడి
2. మారాను పోలిన చేదైన స్థలముల – ద్వారా పోవలసియున్ననేమి
నీ రక్షకుండగు యేసే నడుపును – మారని తనదు మాట నమ్ము
3. ఐగుప్తు ఆశలనన్నియు విడిచి – రంగుగ యేసుని వెంబడించి
పాడైన కోరహు పాపంబుమాని – విధేయులై విరాజిల్లుడి
4. ఆనందమయ పరలోకంబు మనది – అక్కడనుండి వచ్చునేసు
సీయోను గీతము సొంపుగ కలసి – పాడెదము ప్రభుయేసుకు జై
(Seeyonu Paatalu Santhoshamugaa – Paaduchu Seeyonu Velludamu)