వాడుకో… యేసయ్యా… పొద్దు వాలిపోకముందే నన్ను

వాడుకో… యేసయ్యా….

పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో యేసయ్యా 

నీ కాడి నే మోస్తానయ్యా – (2)

1. వాడిపోకముందే నన్ను వాడుకో

     పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో (2)

                   వాడుకో యేసయ్యా – నీ కాడి నే మోస్తా (2)

2. నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే

     నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే (2)          ||వాడుకో||

3. నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోకముందే

     నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే (2)            ||వాడుకో||

4. నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే

     నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే (2)    ||వాడుకో||

5. నీవిచ్చిన ఆరోగ్యం ఆవిరిగా మారకముందే

     నాకున్న అవకాశం చేజారి పోకముందే (2)                  ||వాడుకో||

(Vaaduko Yesayya Poddu Vaalipokamunde Nannu)