రాజ జగమెరిగిన నా యేసురాజా
రాగాలలో అనురాగాలు కురిపించిన – మన బంధము – అనుబంధము
విడదీయగలరా – ఎవరైనను – మరి ఏదైనను ?
1. దీన స్థితియందున – సంపన్న స్థితియందున
నడచినను – ఎగిరినను – సంతృప్తి కలిగి యుందునే
నిత్యము ఆరాధనకు – నా ఆధారమా
స్తోత్రబలులు నీకే – అర్పించెద యేసయ్యా || రాజ ||
2. బలహీనతలయందున- అవమానములయందున
పడినను – కృంగినను – నీ కృపకలిగి యుందునే
నిత్యము ఆరాధనకు – నా ఆధారమా
స్తోత్రబలులు నీకే – అర్పించెద యేసయ్యా || రాజ ||
3. సీయోను షాలేము – మన నిత్య నివాసము
చేరుటయే నా ధ్యానము – ఈ ఆశ కలిగి యుందునే
నిత్యము ఆరాధనకు – నా ఆధారమా
స్తోత్రబలులు నీకే – అర్పించెద యేసయ్యా || రాజ ||
(Raaja Jagamerigina Naa Yesu Raajaa)