యేసుతో ఠీవిగాను పోదమా

యేసుతో ఠీవిగాను పోదమా – అడ్డుగా వచ్చు వైరి గెల్వను

యుద్ధనాదంబుతో బోదము

1. రారాజు సైన్యమందు చేరను – ఆ రాజు దివ్య సేవ చేయను (2)

యేసు రాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా (2) యేసుతో ఠీవిగాను వెడలను  

2. విశ్వాస కవచమును ధరించుచు – ఆ రాజు నాజ్ఞ మదిని నిల్పుచు (2)

అనుదినంబు శక్తిని పొందుచున్నవారమై (2) – యేసుతో ఠీవిగాను వెడలను          

3. శోధనలు మనల చుట్టి వచ్చినా – సాతాను అంబులెన్ని తగిలినా (2)

భయములేదు మనకిక ప్రభువు చెంత నుందుము (2) యేసుతో ఠీవిగాను వెడలను          

4. ఓ యువతి యువకులారా చేరుడి – శ్రీ యేసురాజు వార్త చాటుడి (2)

లోకమంత ఏకమై యేసునాథు గొల్వను (2) సాధనంబెవరు నీవు నేనెగా 

(Yesutho Teevigaanu Podamaa – Addugaa Vachchu Vairi Gelvanu)