యేసు రాజుగా వచ్చు చున్నాడు – భూలోక మంతా

యేసు రాజుగా వచ్చు చున్నాడు – భూలోక మంతా తెలుసుకొంటారు

రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు – రారాజుగా వచ్చు చున్నాడు

యేసు రారాజుగా వచ్చుచున్నాడు

1. మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు –

పరిశుద్ధులందరిని తీసుకు పోతాడు

లోకమంతా శ్రమకాలం -విడువబడుట బహుఘోరం

2. ఏడేండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది

ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది

ఈ సువార్త మూయబడున్‌ – వాక్యమే కరువగును

3. వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును –

ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును

నీతి శాంతి వర్ధిల్లును న్యాయమే కనబడును

4. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర-

సాగిలపడి నమస్కరించి గడగడలాడును

వంగనీ మోకాళ్ళన్నీ యేసయ్యా యెదుట వంగిపోవును

5. క్రైస్తవుడా మరువ వద్దు ఆయన రాకడ-

కనిపెట్టి ప్రార్ధనచేసి సిద్ధముగానుండు
రెప్ప పాటున మారాలి యేసయ్యా చెంతకు చేరాలి

(Yesu Raajugaa Vachchuchunnaadu – Bhoolokamanthaa Thelusukontaaru)