యేసు నాథా దేవా వందనాలు రాజా.. వందనాలు
రాజాధి రాజా నీకే వందనాలు
రవి కోటి తేజా నీకే వందనాలు (2)
1. పాపిని కరుణించి ప్రాణ దానమిచ్చావు
పరమ జీవమిచ్చి పరలోక రాజ్యమిచ్చి (2)
పన్నెండు గుమ్మముల…
పట్టణమే నాకు కట్టిపెట్టినావా ||రాజాధి రాజా||
2. నీచుని ప్రేమించి నీ ప్రాణమిచ్చావు
నీ నీతి నాకిచ్చి నిత్య రాజ్యమిచ్చావు (2)
నీ నీతి నీ రాజ్యం…
నిండైన నా భాగ్యమే ||రాజాధి రాజా||
3. హీనుని దీవించి ఘనునిగా చేసావు
నీ రుధిరమే కార్చి నా ఋణము దీర్చావు (2)
నా సల్లనయ్యా…
నా యన్న నీవే నా యేసయ్యా ||రాజాధి రాజా||
4. కన్ను మిన్ను గానకుండా నిన్ను మీరిపోయాను
చిన్నబుచ్చుకోకుండా నన్ను సమకూర్చావు (2)
నీ మనసే వెన్నయ్యా…
నా కన్న తండ్రి నా యేసయ్యా ||రాజాధి రాజా||
(Yesu Naadhaa Devaa Vandanaalu Raajaa Vandanaalu)