మార్పుచెందవా నీవు మర్పుచెందవా – నీ బ్రతుకు

మార్పుచెందవా నీవు మర్పుచెందవా – నీ బ్రతుకు మార్చుకోవా (2)

అనుకూల సమయం ఇదియేనని ఎరిగి – మారు మనసునూ పొందవా (2)

1. ఎన్నాళ్ళు నీవు జీవించినాగాని – ఏమున్నది ఈ లోకంలో

     ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి – తీర్పున్నది పై లోకంలో (2)

     తీర్పు దినమునందున ఆయన ముందు నీవు – నిలిచే ధైర్యం నీకుందా (2)

     నిలిచే ధైర్యం నీకుందా

2. దిగంబరిగానే వచ్చావు నీవు – దిగంబరిగా పోతావు

     మన్నైన నీవు మన్నై పోతావు -ఏదో ఒక దినమందున (2)

     నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు – నీవెంట రావెన్నడు (2)

     నీవెంట రావెన్నడు

3. ఆత్మని కాక దేహాన్ని చంపే – మనుషులకే భయపడకయ్యా

     ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే – దేవునికే భయపడవయ్యా (2)

     దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు – నీకంటూ ఏముందిలే (2)

     నీకంటూ ఏముందిలే

(Maarpu Chendavaa Neevu Maarpuchendavaa – Nee Brathuku Maarchukovaa)