నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును
శోధించబడిన మీదట – నేను సువర్ణమై మారెదను (2)
1. కడలేని కడలి తీరము – ఎడమాయె కడకు నా బ్రతుకున (2)
గురిలేని తరుణాన వెరువగ – నా దరినే నిలిచేవ నా ప్రభు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ (2)
2. జలములలోబడి నే వెళ్లినా – అవి నా మీద పారవు (2)
అగ్నిలో నేను నడచినా – జ్వాలలు నను కాల్చజాలవు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ (2)
3. విశ్వాస నావ సాగుచు – పయనించు సమయాన నా ప్రభు (2)
సాతాను సుడిగాలి రేపగా – నా యెదుటే నిలిచేవా నా ప్రభు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ (2)
(Nenu Velle Maargamu Naa Yesuke Theliyunu)