నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా (2)
1. యేసుతో గడిపెద యేసుతో నడిచెద (2)
పరమున చేరగ నే వెళ్లెద (2) హనోకు వలె సాగెదా
2. వెనుక శత్రువుల్ వెంటాడిననూ (2)
ముందు సముద్రము ఎదురొచ్చినా (2) మోషే వలె సాగెదా
3. లోకపు శ్రమలు నన్నెదిరించినా (2)
కఠినులు రాళ్ళతో హింసించినా (2) స్తెఫను వలె సాగెదా
4. తల్లి మరచిన తండ్రి విడచిన (2)
బంధువులే నన్ను వెలివేసినా (2) బలవంతునితో సాగెదా
5. బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే (2)
క్రీస్తుకై హత సాక్షిగా మారిన (2) పౌలు వలె సాగెదా
(Ne Saageda Yesunitho Naa Jeevitha Kaalamanthaa)