నీవే నా ప్రాణము నీవే నా సర్వము
నీవే నా జీవము యేసయ్యా (2)
మరువలేను నీదు ప్రేమ
విడువలేనయ్యా నీ స్నేహం (3)
1. మార్గం నీవే సత్యం జీవం నీవే
జీవించుటకు ఆధారం నీవే (2)
అపాయము రాకుండా కాపాడువాడవు
నిను నేను ఆరాధింతున్ (2)
2. తోడు నీవే నా నీడ నీవే
నిత్యం నా తోడుఉండే చెలిమి నీవే (2)
బ్రతుకంతా నీ కొరకే జీవింతును
నిను నేను ఆరాధింతున్ (2)
(Neeve Naa Praanamu Neeve Naa Sarvamu)