నీ వాక్యమే నన్ను బ్రతికించెను – బాధలలో నెమ్మది నిచ్చెను (2)
కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా
వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా (2)
1. జిగటగల ఊభినుండి లేవనెత్తెను –
సమతలమగు భూమిపై నన్ను నిలిపెను (2)
నా పాదములకు దీపమాయెను (2)
సత్యమైన మార్గములో నడుపుచుండెను (2)
2. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై
యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది (2)
అపవాది వేయుచున్న అగ్ని బాణములను (2)
ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పి వేయుచున్నది (2)
3. పాలవంటిది జుంటి తేనె వంటిది
నా జిహ్వకు బహు మధురమైనది (2)
మేలిమి బంగారు కన్న మిన్న అయినది (2)
రత్న రాసులకన్నా కోరతగినది (2)
(Nee Vaakyame Nannu Brathikinchenu Baadhalalo Nemmadinicchenu)