నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా

నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య – నన్ను నన్ను వీడిపోబోకయ్యా (2)

నువ్వు లేక నేను బ్రతుకలేనయ్య – నీవుంటే నాకు చాలు యేసయ్య (2)          

1. కన్నుల్లో కన్నీళ్లు గూడు కట్టినా – కన్నవారే కాదని నన్ను నెట్టినా (2)

     కారు చీకటులే నన్ను కమ్మినా – కఠినాత్ములెందరో నన్ను కొట్టినా (2)

     కఠినాత్ములెందరో నన్ను కొట్టినా                                                ||నిన్నే||

2. చేయని నేరములంటకట్టినా – చేతకాని వాడనని చీదరించినా (2)

     చీకు చింతలు నన్ను చుట్టినా – చెలిమే చితికి నన్ను చేర్చినా (2)

     చెలిమే చితికి నన్ను చేర్చినా                                                        ||నిన్నే||

(Ninne Ninne Nammukunnaanayya – Nannu Nannu Veedipobokayya)