నావన్ని యంగీకరించుమీ దేవా – నన్నెప్పుడు నీవు కరుణించుమీ
నావన్ని కృపచేత నీవలన నొందిన (2)
భావంబునను నేను బహుదైర్యమొందెద
1. నీకు నా ప్రాణము నిజముగా నర్పించి (2)
నీకు మీదుగట్టి నీ కొరకు నిల్పెద
2. సత్యంబు నీ ప్రేమ చక్కగా మది బూని (2)
నిత్యంబు గరముల నీ సేవ జేసెద
3. నీ సేవ జరిగెడు నీ ఆలయమునకు (2)
ఆశచే నడిపించు మరల నా పదములు
4. పెదవులతో నేను బెంపుగ నీ వార్త (2)
గదలక ప్రకటింప గలిగించు దృఢ భక్తి
5. నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమీ (2)
యావంత యైనను నాశింప మదిలోన
6. నీవు నా కొసగిన నిర్మల బుద్దిచే (2)
సేవ జేయగ నిమ్ము స్థిర భక్తితో నీకు
7. చిత్తము నీ కృపా యత్తంబు గావించి (2)
మత్తిల్ల కుండగ మార్గంబు దెలుపుము
8. హృదయంబు నీకిత్తు సదనంబు గావించి (2)
పదిలంబుగా దాని బట్టి కాపాడుము
(Naavanni Angeekarinchumee Devaa – Nanneppudu Neevu Karuninchumee)