తంబుర సితార నాదముతో – క్రీస్తును వేడగ రారండి
ఇద్దరు ముగ్గురు కూడిన చోట – ఉంటాననిన స్వామికే (2)
1. పాపులకై దిగి వచ్చెనట – రోగులకే వైద్యుడని
పాపుల పంక్తిని కూర్చొని (2)
విందులు చేసిన యేసునకే – పేదల పాలిట పెన్నిధికే
2. ప్రతి హృదయం ప్రభు మందిరమై – వెలుగులతో విలసిల్లి
నీ శోధనలను సమిధలుగా (2)
నరకాగ్నులలో పడవేసి – క్రీస్తును చేరగ పరుగిడవా
(Thambura Sitaara Naadamuto Kreesthunu Vedaga Raarandi)