జీవజలమా ఆత్మనాథుడా – ఎండని నదిలాగా

జీవజలమా ఆత్మనాథుడా – ఎండని నదిలాగా రమ్ము బోధకా – 2

రండయ్యా బోధకుడా.. – 2       ఎండని జీవనదిలాగా.. – 2

1. పాదాల కొలత సరిపోదయ్యా – మోకాళ్ల లోతు సరికాదయ్యా – 2

ఈతలా మునిగి లేవాలయ్యా – 2    

తేలి తేలి ఆడాలయ్యా – 2                            || రండయ్యా ||

2. పోవు స్థలమెల్లా ఆరోగ్యమే – పారు చోటెల్లా పరిశుద్ధమే – 2

చేరు దాపంతా సంతృప్తియే – 2

నిలుచు మేరంతా పుష్టికరమే – 2               || రండయ్యా ||

3. కోట్లకోట్ల జాలర్ల గుంపు – పరుగు పరుగున వల వేయాలి – 2

పాడి పాడి చేపలు పట్టి – 2

పరమ దేవునికి ప్రజను చేర్చాలి – 2              || రండయ్యా ||

4. ఒడ్డున చెట్లు విస్తారంగా – పండ్లు ఇవ్వాలి ధారాళంగా – 2

ఔషధమవ్వాలి ఆకులన్నీ – 2

ఆహారమవ్వాలి పండులన్నీ -2                     || రండయ్యా ||

(Jeeva Jalamaa Aathma Naadhudaa Yendani Nadilaagaa Rammu Bodhakaa)