గడచిన కాలం కృపలో మమ్ము – కాచిన దేవా నీకే స్తోత్రము
పగలు రేయి కనుపాప వలె – కాచిన దేవా నీకే స్త్రోత్రము (2)
మము కాచిన దేవా నీకే స్తోత్రము – కాపాడిన దేవా నీకే స్తోత్రము (2)
1. కలత చెందిన కష్టకాలమున – కన్న తండ్రి వై నను ఆదరించిన
కలుషము నాలో కాన వచ్చిన – కాదనక నను కరుణించిన (2)
కరుణించిన దేవా నీకే స్తోత్రము – కాపాడిన దేవా నీకే స్తోత్రము (2)
2. లోపములెన్నో దాగి ఉన్ననూ – దాతృత్వములో నను నడిపించినా
అవిధేయతలే ఆవరించినా – దీవెనలెన్నో దయచేసిన (2)
దీవించిన దేవా నీకే స్తోత్రము – దయ చూపిన దేవా నీకే స్తోత్రము (2)
(Gadachina Kaalam Krupalo Mammu Kaachina Devaa Neeke Sthotramu)