కృప కృప నీ కృప – కృప కృప క్రీస్తు కృప (2)
నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి యున్నాను
నా నమ్మికయుంచి యున్నాను (2)
1. కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను
నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను (2)
నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆదరణ (2)
2. దీన దశలో నేన్నునప్పుడు నను మరువనిది నీ కృప
నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృప (2)
నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆదరణ (2)
(Krupa Krupa Nee Krupa – Krupa Krupa Kreesthu Krupa)