కల్వరి ప్రేమను తలంచునప్పుడు – కలుగుచున్నది దుఃఖం
ప్రభువా నీ శ్రమలను ధ్యానించునప్పుడు – పగులుచున్నది హృదయం (2)
1. గెత్సేమనే అను తోటలో – విలపించుచు ప్రార్ధించు ధ్వని
నలువైపులా వినబడుచున్నది – పగులుచున్నవి మా హృదయములు
కలుగుచున్నది దుఃఖం
2. సిలువపై నలుగ గొట్టిననూ – అనేక నిందలు మోపిననూ
ప్రేమతో వారిని మన్నించుటకై – ప్రార్ధించిన ప్రియ యేసు రాజా
మమ్మును నడిపించుము
3. మమ్మును నీవలె మార్చుటకై – నీ జీవమును ఇచ్చితివి (2)
నేలమట్టుకు తగ్గించుకొని – సమర్పించితివి కరములను
మమ్మును నడిపించుము
(Kalvari Premanu Thalanchunapudu Kaluguchunnadi Duhkham)