కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు
ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు
అను పల్లవి :
ఉందిలే దీవెన ఎందుకా వేదన
పొందిన యాతన దేవుడే మరచునా (2)
1. పలు కాకి లోకం నిందించిన – ఏకాకివై నీవు రోదించిన
అవమాన పర్వాలు ముగిసేనులే – ఆనంద గీతాలు పాడేవులే
నవ్వినోల్లంతా నీ ముందు – తల వంచేను ఇక ముందు
2. అనుకొనని శ్రమ లెన్నో ఎదిరించిన – ఆత్మీయుల ప్రేమ నిదురించిన
అసమానమైన నా దేవుని – బలమైన బాహువు నిను వీడునా
యేసు నిలిచాడు నీ ముందు – నీకు చేసెను కనువిందు
(Kannulu Jaarina Kanneellu Thadipenu Devuni Paadaalu)