ఎంత దూరమైన అది ఎంత భారమైనా

ఎంత దూరమైనా అది ఎంత భారమైనా (2)

యేసు వైపు చూడు నీ భారమంత తీరు (2) తీరానికి చేరు (2)

1. నడచి నడచి అలసిపోయినావా

నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా (2)

కలువరి గిరి దనుక సిలువ మోసిన

నజరేయుడేసు నీ ముందు నడువగా (2) ||యేసు||

2. తెలిసి తెలిసి జారిపోయినావా

తెలియరాని చీకటిలో చిక్కుబడినావా (2)

నిశీధీలో ప్రకాశించు చిరంజీవుడే

పరంజ్యోతి యేసు నీ ముందు నడువగా (2) ||యేసు||

(Yentha Dooramaina Adi Yentha Bhaaramaina)