ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్ధన చేయుదమా
పైరును చూచెదమా పంటను కోయుదుమా
1. కోతెంతో విస్తారమాయెనే
కోసేటి పనివారు కొదువాయెనే
ప్రభుయేసు నిధులన్ని నిలువాయెనే
2. సంఘమా మౌనము దాల్చకుమా
కోసేటి పనిలోన పాలొందుమా
యజమాని నిధులన్ని నీకేగదా
3. శ్రమలేని ఫలితంబు నీకీయగా
వలదంచు వెనుదీసి విడిపోదువా
జీవార్ధ ఫలములను భుజియింపవా
(Idi Kothaku Samayam Panivaari Tharunam Praarthana Cheyudamaa)