ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త – నిత్యుడగు తండ్రి సమాధానకర్త (2)
తనవంటి గొప్పదేవుడు ఎవరున్నారిలలో
తనసాటైనా దీటైనా దేవుడు లేడిలలో – (2)
1. తన చేతిలో రోగాలు లయమైపోయెను
తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను (2)
తన మాటతో ప్రకృతినే శాసించినవాడు (2)
నీటిపై ఠీవిగా నడచినవాడతడు (2) ||ఆశ్చర్యకరుడు||
2. మనకోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చినవాడతడు
మనకోసం సజీవుడై లేచినవాడతడు (2)
తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు (2)
తన సర్వాన్నే ధారబోసిన త్యాగశీలి క్రీస్తు (2) ||ఆశ్చర్యకరుడు||
(Aascharyakarudu Aalochanakarta Nithyudagu Thandri Samaadhaanakartha)