నీతో నేను నడువాలని – నీతో కలిసి ఉండాలని (2)
ఆశయ్యా చిన్న ఆశయ్యా – ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా (2)
1. నడవలేక నేను ఈ లోక యాత్రలో – బహు బలహీనుడనైతినయ్యా (2)
నా చేయి పట్టి నీతో నన్ను – నడిపించుమయ్యా నా యేసయ్యా (2)
నీతో నడువాలని – నీతో ఉండాలని – చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య
||ఆశయ్యా||
2. సౌలును పౌలుగా – మార్చిన నా గొప్ప దేవుడా (2)
నీలో ప్రేమా నాలో నింపి – నీలా నన్ను నీవు మార్చుమయ్యా (2)
నీలా ఉండాలని – నీతో ఉండాలని – చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య
||ఆశయ్యా||
(Neetho Nenu Naduvaalani Neetho Kalisi Undaalani)