స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా
ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా (2)
1. నన్నెంతో ప్రేమించినావు నాకోసం మరణించినావు (2)
మరువగలనా నీ స్నేహము మరచి ఇల నే మనగలనా (2)
2. నా ప్రాణ ప్రియుడా నీ కోసమే నే వేచానే నిరతం నీ తోడుకై (2)
ఇచ్చెదన్ నా సర్వస్వము నాకున్న ఆశలు ఈడేర్చుము (2)
3. కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నను పలుకరించావు (2)
మండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు (2)
(Snehithudaa Naa Snehithudaa Naa Praana Snehithudaa)