సమర్పణ చేయుము ప్రభువునకు

సమర్పణ చేయుము ప్రభువునకు
నీ దేహము ధనము సమయమును (2)

1. అబ్రామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను (2)
నీ బిడ్డను సేవకు నిచ్చెదవా? (2) నీవిచ్చెదవా? నీవిచ్చెదవా?

2. ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులు రెండిచ్చెను కానుకగా (2)
జీవనమంతయు దేవునికిచ్చెను (2) నీవిచ్చెదవా? నీవిచ్చెదవా?

3. నీ దేహము దేవుని ఆలయము నీ దేవుడు మలిచిన మందిరము (2)
సజీవ యాగముగా నిచ్చెదవా? (2) నీవిచ్చెదవా? నీవిచ్చెదవా?

(Samarpana Cheyumu Prabhuvunaku Nee Dehamu)