దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది

దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది

1. యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని
ఇశ్రాయేలీయులను పోగుచేయువాడని

2. గుండె చెదరిన వారిని బాగుచేయువాడని
వారి గాయములన్నియు కట్టుచున్నవాడని

3. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను
వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని

4. ప్రభువు గోప్పవాడును అధికశక్తి సంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని

5. దీనులకు అండాయనే భక్తిహీనుల కూల్చును
సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి

6. వాక్యమును యాకోబుకు తెలియజేసినవాడని
ఏ జనముకీ లాగున చేసియుండలేదని

(Devuniki Sthotramu Gaanamu Cheyutaye Manchidi)