సుగుణాల సంపన్నుడా స్తుతిగానాలవారసుడా

సుగుణాల సంపన్నుడా స్తుతిగానాలవారసుడా
జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము

1. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే
నాట్యమాడెను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే

2. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే
నీవు నన్ను నడిపించగలవు నేను నడువ వలసిన త్రోవలో

3. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే
నీవు నాకిచ్చే మహిమయెదుట ఇవి ఎన్న తగినవి కావే

(Sugunaala Sampannudaa Sthuthigaanaala Vaarasudaa)