ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం నీ కంకితం
శరణం నీ చరణం శరణం నీ చరణం
1. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి
విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి
అయినా నీ ప్రేమతో నన్నుదరిచేర్చినావు
అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం
2. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి ప్రార్ధించి పనిచేయనిమ్ము
ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పనిచేయనిమ్ము
ప్రతిచోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయ్యా
3. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు
కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు
క్షేమ క్షామ కాలమైనా నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా
నశియించే ఆత్మలను నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా
(Idigo Devaa Naa Jeevitham Aapaada Mastakam Nee Kankitham)