దినమెల్ల నే పాడినా కీర్తించినా నీ ఋణము నే తీర్చగలనా
కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా
1. గాయపడిన సమయాన మంచి సమరయునిలా
నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలో ఆహారమిచ్చి
నన్ను పోషించినావు దేవా (2)
నిను విడువనూ ఎడబాయననినా (2) నా యేసయ్య ||దినమెల్ల||
2. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ
నిన్ను పోలి నేను నడిచెదన్
వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్ (2)
ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము (2)
నేను పొందాలని ||దినమెల్ల||
(Dinamella Ne Paadinaa Keerthinchinaa Nee Runamu)