స్తోత్రించెదనయ్య యేసయ్య కీర్తించెదనయ్య
నీవు చేసిన మేళ్ళకు నీ ఋణము తీర్చగ చాలనయ్య
1. ఆది అంతము లేని వాడ ఆల్ఫా ఒమేగా
ఆశ్చర్యకరుడా యేసయ్య ఆలోచనకర్త
నీవు చేసిన మేళ్ళకు నీ ఋణము తీర్చగ చాలనయ్య
2. చావు గోతి నుండి నన్ను లేవనెత్తితివి
జిగటయైన ఊబి నుండి పైకి లేపితివి
నీవు చూపిన ప్రేమకు నీ ఋణము తీర్చగ చాలనయ్య
3. సిలువ మరణం నొందినావా నాకొరకేసయ్య
శ్రమలనన్ని ఓర్చినావా నాకొరకేసయ్య
నీవు చూపిన కరుణకు నీ ఋణము తీర్చగ చాలనయ్య
(Sthotrinchedanayya Yesayya Keerthinchedanayya)