స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసు నాధుని మేలులు తలంచి
1. దివారాత్రములు కంటిపాపవలే కాచి
దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి
2. గాఢాంధ కారములో కన్నీటి లోయలలో
నశించిపోనియక కృపలతో బలపరచితివి
3. సజీవ యాగముగా మా శరీరము సమర్పించి
సంపూర్ణ సిద్ధినొంద శుద్ధాత్మను నొసగితివి
4. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి
యేసుని వెంబడింప యెంత భాగ్యము నిచ్చితివి
5. పాడెద హల్లెలుయా మరనాత హల్లెలుయా
సదా పాడెద హల్లెలుయా ప్రభు యేసుకు హల్లెలుయా
(Sthotram Chellinthumu Sthuthi Sthotram Chellinthumu)