స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా (2)
1. అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభూ (2)
నీతి న్యాయములు నీ సింహాసనాధారం (2)
కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు (2) ||స్తుతి||
2. బలియు అర్పణ కోరవు నీవు బలియైతివి నా దోషముకై (2)
నా హృదయమే నీ ప్రియమగు ఆలయం (2)
స్తుతియాగమునే చేసెద నిరతం (2) ||స్తుతి||
3. బూరధ్వనులే నింగిలో మ్రోగగా రాజధిరాజ నీవే వచ్చువేళ (2)
సంసిద్ధతతో వెలిగే సిద్దెతో (2)
పెండ్లి కుమరుడా నిన్నెదుర్కొందును (2) ||స్తుతి||
(Sthuthi Simhasanaasinudaa Yesu Raajaa Divya Teja)