స్తుతి సింహాసనాసీనుడా – నా ఆరాధనకు పాత్రుడా (2)
నీవేగా నా దైవము – యుగయుగాలు నే పాడెదన్ (2)
1. నా వేదనలో నా శోధనలో లోకుల సాయం వ్యర్థమని తలచి (2)
నీ కోసమే – నీ కృప కోసమే (2)
నీ సముఖములో నిలిచానయ్యా – యేసయ్యా.. నీ ఆత్మతో నింపుమయ్యా (2)
2. నీ సేవలోనే తరియించాలని – నీ దరికి ఆత్మలను నడిపించాలని (2)
నీ కోసమే – నీ కృప కోసమే (2)
నీ నీడలో నిలిచానయ్యా – యేసయ్యా.. నీ శక్తితో నింపుమయ్యా (2)
3. నా ఆశయముతో నా కోరికతో – నా గురి నీవని పరుగిడుచుంటిని (2)
నీ కోసమే – నీ కృప కోసమే (2)
నీ వెలుగులో నిలిచానయ్యా – యేసయ్యా.. నీ మహిమతో నింపుమయ్యా (2)
(Sthuthi Simhaasanaaseenudaa Naa Aaraadhanaku Paatrudaa)