సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు

సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు
నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా (2)

1. ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా (2)
ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా (2)

2. శోధనలను జయించినచో భాగ్యవంతుడవు (2)
జీవ కిరీటం మోయువేళ ఎంతో సంతోషము (2)

3. వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడి కొనియాడు (2)
తీర్చి దిద్దే ఆత్మ నిన్ను చేరే ప్రార్ధించు (2)

(Solipovaladu Manassaa Solipovaladu)