సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మతో
మన ప్రభు యేసుని ఆ ఆ ఆఆ
1. మోషేకంటే శ్రేష్టుడు అన్ని మోసములనుండి విడిపించున్
వేషధారులను ద్వేషించున్ – ఆశతో మ్రొక్కెదము
2. అహరోనుకంటే శ్రేష్టుడు – మన ఆరాధనకు పాత్రుండు
ఆయనే ప్రధాన యాజకుడు – అందరము మ్రొక్కెదము
3. ఆలయముకన్న శ్రేష్టుడు – నిజ ఆలయముగ తానే యుండెన్
ఆలయము మీరేయనెను – ఎల్లకాలము మ్రొక్కెదము
4. యోనా కంటె శ్రేష్టుడు – ప్రాణ దానముగా తన్ను అర్పించెన్
మానవులను విమోచించెన్ – ఘనపరచి మ్రొక్కెదము
5. సొలోమోను కన్న శ్రేష్ఠుడు – సర్వజ్ఞానమునకు ఆధారుండు
పదివేలలో అతిప్రియుండు – పదిలముగ మ్రొక్కెదము
6. రాజులకంటే శ్రేష్ఠుడు – యాజకులనుగా మనలను చేసెన్
రారాజుగ త్వరలో వచ్చున్ – రయముగను మ్రొక్కెదము
7. అందరిలో అతి శ్రేష్ఠుడు – మనకందరికి తానే ప్రభువు
హల్లెలూయకు పాత్రుండు – అనుదినము మ్రొక్కెదము
(Saagilapadi Mrokkedamu Sathyamutho Aathmatho Mana Prabhu Yesuni)